మాజీ కౌన్సిలర్ మృతి.. అవయవాలు దానం

మాజీ కౌన్సిలర్ మృతి.. అవయవాలు దానం

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ ఏడో వార్డు మాజీ కౌన్సిలర్ ఇట్టెడి నర్సారెడ్డి (47) శుక్రవారం మృతి చెందారు. బ్రెయిన్ స్ట్రోక్ రాగా కుటుంబ సభ్యులు ఆయనను HYD ఆసుపత్రిలో చేర్పించారు. శస్త్రచికిత్స తర్వాత బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో నర్సా రెడ్డి భార్య ఇట్టెడి సునీత, కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఆయన అవయవాలు దానం చేశారు.