హత్య కేసులో ఇద్దరికీ జైలు శిక్ష

కాకినాడ: బావ హత్య కేసులో ఇద్దరు బావ మరుదులకు పిఠాపురం 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీహరి జైలు శిక్ష విధించారు. 2019లో గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామానికి చెందిన శ్రీనును అతని భార్య బంధువులైన చంద్రబాబు, అర్జున్ కొట్టి చంపారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో వారికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది.