బాండ్ పేపర్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్థి
VKB: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌడపూర్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి బ్యాగరి వెంకటేష్ తన హామీలను బాండ్ పేపర్‌పై రాసి ఇచ్చారు. గ్రామంలో మొత్తం ఏడుగురు వ్యక్తులు సర్పంచ్ పదవి కోసం పోటీలో నిలిచారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒకరితో ఒకరు పోటీ పడుతూ హామీలు ఇస్తున్నారు.