పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సేవలో ఎంపీ
GDWL: కేటీదొడ్డి మండలం పరిధిలోని శ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని మహబూబ్‌నగర్ ఎంపీ డీ.కె. అరుణ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో పురేందర్, అర్చకులు ఎంపీకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అరుణతో పాటు గద్వాల జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.