జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత
MBNR: జిల్లాలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కర్ పేటలో 15.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో 15.9 డిగ్రీలు, బాలానగర్‌లో 16.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు.