త్వరలోనే రోడ్డు విస్తరణ పనుల పూర్తి: ఎమ్మెల్యే

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు బుధవారం సుల్తానాబాద్‌లో రూ. 65 లక్షలతో నిర్మించనున్న ఆర్&బీ గదులు, సెంట్రల్ లైటింగ్ పనులను పరిశీలించారు. సుల్తానాబాద్-శ్రీరాంపూర్ రోడ్డు విస్తరణ త్వరలో పూర్తి చేస్తామని, ఐబీ చౌరస్తా-శాంతినగర్ చౌరస్తా రోడ్డు పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు.