ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించిన కాంగ్రెస్ నాయకులు

ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించిన కాంగ్రెస్ నాయకులు

MHBD: గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలోని వస్త్రం తండా నుంచి గాజులగట్టు వచ్చే దారిలో గల రాయికుంట కట్టపై, మూలమలుపుల వద్ద దారి పొడవునా చెట్లు పెరిగి, ప్రమాదకరంగా మారాయి. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు తమ సొంత ఖర్చుతో JCBతో ఇవాళ ఉదయం ఈ చెట్లను తొలగించారు.