తూములో ఇరుక్కొని వ్యక్తి మృతి
MHBD: తొర్రూరు మండలం మాటేడు శివారు బండమీది తండాకు చెందిన జాటోత్ నరేష్ (34) తన కుమారుడు హరికృష్ణతో కలిసి తన పొలం నారుమడి దున్నడానికి వెళ్ళాడు. నీళ్ల కోసం తూములో అడ్డుపడిన రాళ్లను తొలగించేందుకు తూములోకి వెళ్ళగా, అందులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి తండ్రి బాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేపట్టినట్లు ఎస్సై ఉపేందర్ పేర్కొన్నారు.