పెనుగొండ పోలీస్ స్టేషన్‌పై రాళ్ల దాడి

పెనుగొండ పోలీస్ స్టేషన్‌పై రాళ్ల దాడి

ప.గో: పెనుగొండ పోలీస్ స్టేషన్ వద్ద తెల్లవారుజామున ఉద్రిక్తత చోటుచేసుకుంది. సూర్య అనే వ్యక్తి ఇన్‌‌స్టాగ్రామ్ వేదికగా అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. దళిత నేతలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో స్టేషన్ పైకి రాళ్లు విసరగా.. భవనం అద్దాలు, లోపలి సీసీ కెమెరాలు ధ్వంసమైనట్లు సమాచారం. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో నిరసనకారులు వెళ్లిపోయారు.