తగ్గని పోచారం ప్రాజెక్ట్ ఫ్లో

మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టు ఓవర్ ఫ్లో ఏమాత్రం తగ్గలేదు. బుధవారం ఉదయం 21.5 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి, గాంధారి, లింగంపేట్ నుంచి వస్తున్న వాగులు ప్రాజెక్టులో చేరుతున్నాయి. ప్రాజెక్టు ఓవర్ ఫ్లో అవుతుండడంతో పర్యాటకుల సందడి నెలకొంది.