గంభీర్ వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్‌వాష్ కావడంతో కోచ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గౌహతి టెస్ట్ అనంతరం ఆయనకు వ్యతిరేకంగా ఫ్యాన్స్ నినాదాలతో హోరెత్తించారు. సిరాజ్‌తోపాటు సహాయ సిబ్బంది వారిస్తున్నా వారు శాంతించలేదు. కాగా గంభీర్ కోచింగ్‌లో ఆడిన 19 టెస్టుల్లో టీమిండియా 7 మాత్రమే గెలిచింది. 10 మ్యాచుల్లో ఓడగా.. 2 డ్రా అయ్యాయి.