గాలి నుంచి నీరు.. IIT విద్యార్థుల ప్రయోగం
TPT: గాలిని తీసుకుని, అందులోని తేమను స్వీకరించి స్వచ్ఛమైన నీటిగా మార్చే యంత్రాన్ని తిరుపతి ఐఐటీ విద్యార్థులు రూపొందించారు. 'ఎయిర్ టూ వాటర్' అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన దీనిని తిరుపతిలోని రీజినల్ సైన్స్ సెంటర్లో అందుబాటులో ఉంచారు. గాలి నుంచి నీటిని సేకరించే బీటిల్స్, ఎడారిలో నివసించే కాక్టస్ మొక్కల నుంచి ప్రేరణతో దీనిని తయారు చేసినట్లు విద్యార్థులు తెలిపారు.