అలీరాజ్‌పేటలో ప్రకృతి ఎరువుల కేంద్రం

అలీరాజ్‌పేటలో ప్రకృతి ఎరువుల కేంద్రం

SDPT: జగదేవ్‌పూర్ మండలంలోని అలీరాజ్‌పేటలో ఓ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బయో రిసోర్స్ సెంటర్‌ను సర్పంచ్ ఎల్లేష్ ప్రారంభించారు. సుమారు 60 ఎకరాలకు సరిపడా ప్రకృతి ఎరువులు (బ్రహ్మాస్త్రం, అగ్నియాస్త్రం,జీవామృతం) అందించే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉందని పేర్కొన్నారు. రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి సిద్ధమైన ఇన్‌పుట్స్ వాడాలని పుర్రా మేనేజర్ రావుల సూచించారు.