'కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు చేపట్టండి'
ATP: 10th పరీక్ష ఫీజు రూ.125 ఉండగా కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి రూ.500 నుంచి రూ.2000 వసూలు చేసినట్లు AISF జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి డీఈవో ప్రసాద్ బాబు ప్రైవేట్ కళాశాలల దోపిడీని అరికట్టాలని ఆయన వినతి పత్రం ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసిన వారిపై చర్యలు చేపట్టాలన్నారు.