VIDEO: సుంకేసుల రిజర్వాయర్‌కు భారీ వరద ప్రవాహం

KRNL: కోడుమూరులోని సుంకేసుల రిజర్వాయర్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 34,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. దీంతో జలాశయం నుంచి 7 గేట్లు ఎత్తి 30,653 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కేసీ కెనాల్‌కు 2,180 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ప్రస్తుతం జలాశయంలో 1.110 TMCల నీరు నిల్వ ఉందని జలాశయం అధికారులు పేర్కొన్నారు.