గ్యాస్ కనెక్షన్‌ను పంపిణీ చేసిన బీజేపీ నాయకులు
NLR: బుచ్చి పట్టణంలోని రామచంద్రపురం గ్రామంలో BJP అర్బన్ అధ్యక్షుడు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉజ్వల పథకంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు గ్యాస్‌ను ఆయన పంపిణీ చేశారు. ప్రతి నిరుపేద కుటుంబానికి గ్యాస్ ఉండాలని భారతదేశంలో ఉజ్వల పథకంతో ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.