VIDEO: కొనసాగుతున్న యూరియా కష్టాలు

VIDEO: కొనసాగుతున్న యూరియా కష్టాలు

కృష్ణా: తోట్లవల్లూరు మండలం సౌత్ వల్లూరు పీఎసీసీఎస్ వద్ద మంగళవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. స్టాక్ తక్కువగా ఉండటంతో ఎకరాకు అరకట్ట మాత్రమే ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. పట్టాదారు పాస్‌బుక్, శిస్తు రసీదు, ఆధార్ తప్పనిసరి చేశారు. నిబంధనలతో రేపు ఇస్తామని చెప్పటంతో రైతులు నిరాశగా వెనుదిరిగారు.