రోళ్ళపాడులో ఘనంగా ముగిసిన TTD ధార్మిక కార్యక్రమాలు
NDL: మిడుతూరు మండలం రోళ్ళపాడు గ్రామంలో ఇవాళ TTD ఆధ్వర్యంలో జరిగిన ధార్మిక కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా గోపూజ, కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.