'రాష్ట్రంలోనే రెండోస్థానంలో ఖమ్మం డీసీసీబీ'

KMM: ఖమ్మం DCCB రూ.3,743 కోట్ల లావాదేవీలతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని ఛైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకు డిపాజిట్లు గతేడాదితో పోలిస్తే రూ.121 కోట్లు పెరిగి రూ.1,265 కోట్లకు చేరాయని చెప్పారు. ఇక రుణాలు రూ.355 కోట్లు పెరిగి రూ.2,195 కోట్లకు చేరాయన్నారు.