అలరించిన యక్షగానం నృత్య రూపకం
KKD: కర్ణాటక సంప్రదాయ నృత్యరూపకం యక్షగానంలో 'సుందోపసుంద కలగ' ప్రదర్శన గురువారం రాత్రి పిఠాపురం పట్టణంలోని పీఠికాపురం కళావేదికపై జరిగింది. సంగమేశ్వర సంగీత సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, అత్యాశ, అసూయలు బంధాలను ఎలా నాశనం చేస్తాయో కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ఇట్టి నాటక ప్రదర్శన అక్కడి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.