బిర్యానీ తిన్నందుకే విద్యార్థులపై దాడి
కృష్ణా: బాపులపాడు మండలం వేలూరు గ్రామంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో దారుణ ఘటన వెలుగు చూసింది. హస్టల్‌కు బయట నుంచి తెచ్చుకున్న చికెన్ బిరియానీ తిన్నారని ఆరోపణలతో 8వ తరగతి చదువుతున్న 26 మంది విద్యార్థులను స్కూల్ సిబ్బంది తీవ్రంగా దెబ్బతీశారు. తోటి విద్యార్థులు తెచ్చిన బిరియానీ తిన్నందుకే మహేంద్రను అమానుషంగా కొట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.