VIDEO: పొదల వలలో చిక్కుకున్న కరెంట్ తీగలు

AKP: రోలుగుంట పోలీస్ స్టేషన్ సమీపంలో కరెంట్ తీగలపై అల్లుకున్న పిచ్చిపొదలు ప్రమాదకర పరిస్థితులు సృష్టిస్తున్నవి. వర్షాకాలంలో తడి కొమ్మలు తీగలను తాకి షార్ట్ సర్క్యూట్ సంభవించే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకొని పొదలను తొలగించాలని విద్యుత్ శాఖను స్థానికులు కోరుతున్నారు.