ఇండస్ట్రీకి నా అవసరం లేదు: హనీ రోజ్
మలయాళ నటి హనీ రోజ్ 'రాహెల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ క్రమంలో హనీ రోజ్ కీలక వ్యాఖ్యలు చేసింది. 'మలయాళ ఇండస్ట్రీకి నా అవసరం ఉందా? అని అడిగితే లేదనే చెప్తాను. నేనే ఈ ఇండస్ట్రీకి గట్టిగా అతుక్కుపోయాను. సినిమా అంటే నాకు పిచ్చి.. మంచి పాత్రలనే నేను ఎంచుకుంటాను' అని చెప్పుకొచ్చింది.