'దేశ నాయకుల ఆశయ సాధనకు కృషి చేయాలి'

VZM: పేదలందరీకీ స్వాతంత్య్రం ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని బొబ్బిలి MLA బేబినాయన అన్నారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బొబ్బిలి కోటలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగుర వేసి స్వాతంత్య్ర సమర వీరుల త్యాగాలను గుర్తు చేశారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించి ప్రాణ త్యాగం చేసిన దేశ నాయకుల ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.