'కార్మికుల భద్రతకై ప్రత్యేక కమిటీలు వేయాలి'
NLG: నోస్ ఫార్మాస్యూటికల్ ల్యాబ్‌లో జరిగిన ప్రమాదంపై తెలంగాణ ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కంపెనీ కార్మికుల భద్రతకై ప్రత్యేక కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. గాయపడిన కార్మికులకు ప్రభుత్వం, యాజమాన్యం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న సంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.