రేపటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ప్రచారం
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రచారంలో అధికార, ప్రతిపక్షాలు నువ్వానేనా అన్నట్లు ఓటర్లను ఆకర్షించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుండడంతో ప్రచారం వేగవంతం చేశారు. ప్రస్తుతం పార్టీలు ప్రతి పోలింగ్ కేంద్రం, డివిజన్ వారీగా లెక్కలు వేస్తూ 'పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాయి.