అధికారుల నిర్లక్ష్యం.. చెత్తకుండీలు నిరుపయోగం

అధికారుల నిర్లక్ష్యం.. చెత్తకుండీలు నిరుపయోగం

HNK: నగర పరిశుభ్రత కోసం ప్రజల నుంచి పన్నులతో కొనుగోలు చేసిన చెత్తకుండీలు అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో వీటిని ఏర్పాటు చేయకపోవడంతో అవి ఒకచోట కుప్పలుగా పడి తుప్పు పడుతున్నాయి. దీనివల్ల ప్రజలు చెత్తను రోడ్లపైనే వేయాల్సి వస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి, రద్దీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.