గ్రూప్ -1 పరీక్షలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

VSP: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రేపటి నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. అభ్యర్థులను ఉదయం 9:45 గంటల వరకే అనుమతిస్తారన్నారు. ఒరిజినల్ హాల్ టికెట్, గుర్తింపు కార్డు మాత్రమే తీసుకురావాలని చెప్పారు. ఇతర సమాచారం కోసం కలెక్టరేట్లో 0891-2590100, 0891-2590102 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.