చెక్ డ్యాం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
JN: పాలకుర్తి మండలం వల్మీడి, ముత్తారం గ్రామాల్లో సాగునీటి వనరుల అభివృద్ధి, భూగర్భ జలాల నిల్వ కోసం రూ. 25 కోట్లతో చేపట్టనున్న చెక్ డ్యాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి బీడు నేలను పచ్చని పంటలతో కళకళలాడేలా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు.