VIDEO: పొలం వద్ద ఇరు వర్గాలు ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

VIDEO: పొలం వద్ద ఇరు వర్గాలు ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

CTR: పుంగనూరు మండల పరిధిలోని చిట్టెమ్మవారిపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ భూమి వద్ద గొడవ చోటుచేసుకుంది. కమ్మన్న (82), కృష్ణమూర్తి (32), నారాయణ (57)ల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి రాడ్లు, రాళ్లతో దాడులకు దారి తీసింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కుటుంబ సభ్యులు పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.