అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్
MHBD: మరిపెడ మున్సిపాలిటీలోని పదవ వార్డులో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరిపెడ మున్సిపాలిటీ గత పదేళ్లుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరిపెడ అభివృద్ధి పథంలో పరిగెడుతుందని అన్నారు. త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు.