యువకుడి అదృశ్యంపై కేసు నమోదు

GNTR: గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్‌లో ఓ యువకుడి అదృశ్యంపై మంగళవారం కేసు నమోదైంది. పొన్నూరకి చెందిన డొక్కు విజయ్ కృష్ణ, గుంటూరు లక్ష్మీపురంలోని బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేసే అమ్మాయిని ప్రేమిస్తూ, పెళ్లి గురించి మాట్లాడమని తల్లిదండ్రులను కోరగా వారు నిరాకరించారు. దీంతో ఈనెల 17 నుంచి విజయ్ కృష్ణ కనిపించకుండా పోయాడు.