ఆర్టీసీ పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కానుకలు
VSP: ద్వారకా బస్ స్టేషన్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశాఖపట్నం రీజనల్ మేనేజర్ బీ.నాయుడు బహుమతులు పంపిణీ చేశారు. ద్వారకా బస్ స్టేషన్ పారిశుద్ధ్యంలో ముందంజలో ఉండడానికి కార్మికులు, స్టేషన్ మేనేజర్లు చేసిన కృషి ప్రశంసనీయమని ఆయన తెలిపారు.