మొక్కజొన్న రైతుల పోరుబాట
కర్ణాటకలో మొక్కజొన్న రైతులు పోరుబాట పట్టారు. క్వింటాకు రూ.3 వేలు మద్దతు ధర కోరుతూ రోడ్డెక్కారు. మరో వైపు అన్నదాతల కష్టాలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవటం లేదని బీజేపీ మండిపడింది. రైతుల కష్టాలపై ఉద్యమించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ నెల 27, 28 తేదీల్లో నియోజకవర్గాల స్థాయిలో, డిసెంబరు 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడతామని చెప్పింది.