దర్గాలో చాదర్ సమర్పించిన ఎమ్మెల్యే

దర్గాలో చాదర్ సమర్పించిన ఎమ్మెల్యే

WNP: కొత్తకోటలో వెలసిన హజ్రత్ వాహెద్ షా ఖాద్రి (టెక్కలయ్య) ఉర్సు ఉత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు  ముఖ్య అథితిగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన దర్గాను దర్శించుకుని చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.