అక్రమ తవ్వకాలపై తహసీల్దార్ హెచ్చరిక

అక్రమ తవ్వకాలపై తహసీల్దార్ హెచ్చరిక

NRPT: నర్వ మండలంలో అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తవ్వకాలు జరిపితే వాహనాలను సీజ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నర్వ తహసీల్దార్ మల్లారెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహజ వనరుల దోపిడీని అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపారు. అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.