ఆలయంలో అచ్చమ్మ బాయి విగ్రహ ప్రతిష్టాపన

MHBD: మరిపెడ మండలం, బీచ్ రాజు పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని, జర్పులతండ గ్రామంలో నూతనంగా నిర్మించిన అచ్చమ్మ బాయి అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య విగ్రహాలను ప్రతిష్టించారు. జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గుడిపూడి నవీన్ రావు, బద్రు తదితరులు పాల్గొన్నారు.