ఈనెల 30న కార్తిక నృత్యోత్సవం

ఈనెల 30న కార్తిక నృత్యోత్సవం

HNK: శ్రీ భారతి కళాక్షేత్రం కల్చర్ సొసైటీ, ఆధ్వర్యంలో ఈ నెల 30న HNKలోని అంబేడ్కర్ భవన్‌లో కార్తీక నృత్యోత్సవం, ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం బాలసముద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో WGL పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కనుమరుగవుతున్న శాస్త్రీయ నృత్య కళలను పునరుజ్జీవం చేయడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.