లేట్ డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లు అందజేత

ప్రకాశం: వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం పంచాయతీ, రామన్నపేట పంచాయతీ పరిధిలో నివసిస్తున్న యానాది కులాలకు చెందిన వారికి బుధవారం తహసీల్దార్ పార్వతీ, ఎంపీడీవో రాజేష్ లేట్ డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. 18 సంవత్సరాల పైబడి ఆధార్ లేని 40 మంది యానాదులను గుర్తించి వారికి లేట్ డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లను అందించామన్నారు.