ఇటలీ ప్రధాని మెలోనీకి బిగ్ షాక్
పార్లమెంట్ ఎన్నికలు మరో ఏడాదిలో జరగనుండగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి గట్టి షాక్ తగిలింది. దేశంలో న్యాయవ్యవస్థ సంస్కరణలపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆమెకు నిరాశ ఎదురైంది. 54% మంది సంస్కరణలను తిరస్కరించగా, 46% మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. అధికార పక్షంలో లుకలుకలు రాగా, ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరించి ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టింది.