డ్రగ్స్ వ్యాపారిపై పోలీసుల కట్టడి

డ్రగ్స్ వ్యాపారిపై పోలీసుల కట్టడి

SRD: పటాన్‌చేరు రామేశ్వరం బండ గ్రామంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సురేష్ రాయ్ (46) ఒడిశా మల్కనగిరి నుంచి గంజాయి తెచ్చి స్థానికులకు అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడైంది. అతని వద్ద 798 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఎన్.రాజు తెలిపారు.