BREAKING: టాస్ గెలిచిన టీమిండియా
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోవడం, జింబాబ్వేపై భారత్ ఘనవిజయంతో ఈ పోరు రసవత్తరంగా మారిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 5న ముంబైలో జరిగే సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది.