'గణేష్ మండపాల పూర్తి బాధ్యత నిర్వాహకులది'

SRCL: గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదే అని తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి అన్నారు. తంగళ్ళపల్లిలోని పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడారు. మండలంలోని గణేష్ మండపం నిర్వాకం నిర్వాహకులు https:policeportal.tspolice .gov.in/ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.