మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య
SDPT: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఎర్రవల్లి ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన గణేశ్ (48) ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. నిన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.