ఇంటి గోడలు కూలి ఇద్దరు మృతి

ఇంటి గోడలు కూలి ఇద్దరు మృతి

NDL: ఉయ్యాలవాడ మండలం పాంపల్లెలో విషాదం చోటుచేసుకుంది. పాత ఇంటికి మరమ్మతులు చేస్తుండగా గోడలు కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. గంప తిరుపాల్‌కు చెందిన పాత ఇంటికి మరమ్మత్తులు చేసేందుకు ఏడుగురు కూలీలు పనికి వెళ్లారు. పని చేస్తుండగా గోడలు విరిగి వారిపై పడ్డాయి. దీంతో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.