రేపే అందెశ్రీ అంత్యక్రియలు
HYD: ప్రజాకవి అందెశ్రీ ఇవాళ ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా లాలాపేటలోని ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో అందెశ్రీ పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి లాలాపేట్ నివాసానికి తరలించారు. కాగా, రేపు ఉదయం ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.