సేంద్రియ ఆహారం ఆరోగ్య జీవనానికి భరోసా: ACP
HNK: సేంద్రియ ఆహారం ఆరోగ్య జీవనానికి భరోసా అని సిటీ స్పెషల్ బ్రాంచ్ ACP జితేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సేంద్రియ ఆహార పదార్థాల మేళా ముగింపు కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంతలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. సేంద్రియ ఉత్పత్తుల వివరాలు, ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.