'బాల్యవివాహాలు దురాచారం'
KKD: పిఠాపురం RBHR ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహ ముక్త భారత్ మరియు పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య వివాహా రహిత దేశంగా భారత దేశాన్ని తీర్చి దిద్దాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను విద్యా రంగ సంస్థలలో నిర్వహించడం జరుగుతోందన్నారు. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం అని సిడిపివో దుర్గాదేవి తెలియజేశారు.