రెండు బైకులు ఢీకుని ఒకరు మృతి

SRD: నార్సింగ్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44 పక్కన సర్వీస్ రోడ్డులో సొసైటీ సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి. చేగుంట మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన నేనావత్ మంత్య (45) అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి స్థానికులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.