VIDEO: లేబర్ కోడ్ల రద్దుకు డిమాండ్
బాపట్ల,చీరాల బస్టాండ్ సెంటర్లో AITUC ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించి, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా ద్వారా కార్మికుల హక్కులను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గోసాల సుధాకర్, బ్రాంచ్ అధ్యక్షులు బోయిన పోతురాజు, బ్రాంచ్ కార్యదర్శి కుందర్తి నీలాంబరం, రాష్ట్ర కోశాధికారి పఠాన్ కాలేశా, రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ పెరుగు తిరుమల రావు, తదితరులు పాల్గొన్నారు.